మీరట్‌ రమదాన్‌లో తక్కువ ధరకే ఫుడ్‌ ఐటమ్స్‌

- May 13, 2017 , by Maagulf
మీరట్‌ రమదాన్‌లో తక్కువ ధరకే ఫుడ్‌ ఐటమ్స్‌

రమదాన్‌ సందర్భంగా ఫుడ్‌ సప్లయ్స్‌, మరియు ఇతర అవసరాలకోసం వినియోగించే అనేక వస్తువులు మీరట్‌ రమదాన్‌లో తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. కటారా - కల్చరల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ సదరన్‌ ప్రాంతంలో దీన్ని నిన్ననే ప్రారంభించారు. జూన్‌ 29 వరకు ఈ మార్కెట్‌ తెరచి ఉంటుంది. మార్కెట్‌లో మొత్తం 35 స్థానిక షాప్‌లు, పలు రకాలైన ఫుడ్‌ ఐటమ్స్‌ని అందుబాటులో ఉంచుతున్నాయి. డేట్స్‌, స్వీట్స్‌, డ్రైడ్‌ ఫ్రూట్స్‌, నట్స్‌, వెజిటబుల్స్‌, బ్రెడ్‌, మిల్క్‌, మీట్‌ వంటివి తక్కువ ధరకే లభ్యమవుతాయిక్కడ. టమోటాలు, ఎగ్‌ ప్లాంట్‌ కిలో 5 ఖతారీ రియాల్స్‌కి అల్‌ అలామ్యా ఫార్మ్స్‌ షాప్‌లో లభ్యమవుతాయి.అల్జానౌబ్‌ స్టానలో పలు రకాలైన నట్స్‌ 10 నుంచి 30 ఖతారి రీయిల్స్‌కి ఒక్కో ప్యాక్‌ లభ్యమవుతుంది. మీరట్‌ రమదాన్‌, ఈ రమదాన్‌ సీజన్‌లో వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కటారా కల్చరల్‌ విలేజ్‌, షాపింగ్‌ ప్రియులకి, ఔత్సాహికులకి మంచి డెస్టినేషన్‌గా మారిందని కటారా జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఖాలిద్‌ బిన్‌ ఇబ్రహీమ్‌ అల్‌ సులైటి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com