రీఎంట్రీకి రెడీ అవుతున్న విజయశాంతి
- May 13, 2017
తెలుగులో హీరోతో పోటీ పడి మరీ డ్యాన్సులు, ఫైట్లు చేసి లేడి బాస్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచింది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు రాజకీయ అరంగేట్రం చేసి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం పలువురు దర్శకుల వద్ద కథలు కూడా వింటున్నట్టు సమాచారం. నిర్మాతలతో కలిసి చర్చలు కూడా జరుపుతుంది.
తనకు సరిపోయే కథలను ఓ వైపు వింటూనే మరోవైపు శారీరక కసరత్తులు మొదలెట్టింది. మునుపటి వలె తన స్టామినా చూపించడానికి ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టింది. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు తనకు సరిపోయే కథలను ఎంపిక చేసుకుని మునుపటిలాగే వెలగాలని ఈ అమ్మడు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివరికల్లా విజయశాంతి కొత్త చిత్రం ప్రారంభం కానుంది అని ఆమె సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









