'గల్ఫ్‌లో పనిచేసేవారు తమ వివరాలు అందించాలి'
- May 13, 2017
గల్ఫ్‌లో పనిచేసే వారు తప్పనిసరిగా తమ వివరాలను అందించాలని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో విదేశీ సంపర్క్ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. విదేశాల్లోని భారతీయుల సంక్షేమం, రక్షణ, పాస్‌పోర్టు తదితర అంశాలపై సమావేశంలో వక్తలు చర్చిస్తున్నారు. భేటీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా వీకే సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ఎంతో విశిష్టమైన పేరు ఉందన్నారు.
తెలంగాణలో దాదాపు అన్ని రాష్ర్టాల ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి విదేశాలకు ఎక్కువ మంది వలస వెళ్తున్నరన్నారు. ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తమని తెలిపారు. ఈ మైగ్రేట్ పోర్టల్‌తో ప్రవాస భారతీయులకు లాభం చేకూరుతుందన్నారు. కావునా గల్ఫ్‌లో పనిచేసేవారు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా కేంద్రం మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







