జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి చర్చపై బ్రిటన్ రచ్చ

- May 13, 2017 , by Maagulf
జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి చర్చపై బ్రిటన్ రచ్చ

టైమ్స్ నౌ ఛానెల్ లో జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి గతంలో నిర్వహించిన న్యూస్ అవర్ పై బ్రిటన్ లోని బ్రాడ్ కాస్ట్ రెగ్యులేటర్ ...ఆఫ్ కామ్ రచ్చ చేసింది. ఆ కార్యక్రమమంతా చాలావరకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉందని, పక్షపాతం చూపేదిగా ఉందని ఆరోపించింది. (అర్నబ్ ఆ తరువాత ఈ ఛానల్ లో ఎడిటర్-ఇన్ చీఫ్ పోస్టు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే). 2016 ఆగస్టు-సెప్టెంబరు నెలల మధ్యకాలంలో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగిన సమయంలో ఈ న్యూస్ అవర్ కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. వాటిలో చాలా సందర్భాల్లో పాకిస్తానీ వ్యూ పాయింట్స్ కి తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని, భారత అభిప్రాయాలకే ఇంపార్టెన్స్ ఇచ్చారని ఆఫ్ కామ్ విమర్శించింది. ఇందుకు కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావించారు. పాకిస్తానీ మిలిటెంట్ల విషయమై చర్చ జరిగినప్పుడు (గత ఏడాది ఆగస్టు 1 న) జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ గ్రాండ్ ముఫ్తీ నాసిర్ ఉల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యకు స్పందించిన అర్నబ్.. ఇస్లాం పాకిస్తానీయుల చేతిలో బందీగా మారిందని, మీ విషాన్ని చొప్పించే సాధనంగా ఈ ఛానల్ ని అనుమతించబోనని అన్నారు.
(పాక్ మిలిటెంట్లు సయ్యద్ సలావుద్దీన్, హఫీజ్ సయీద్ లు వాఘా సరిహద్దుల వద్ద మార్చ్ నిర్వహించిన సందర్భమది). అర్నబ్ కామెంట్ పై నాసిర్..ఈ చర్చ నుంచి నేను విరమించుకున్నానని కోపంగా వ్యాఖ్యా నించారు.. ఇలాగే హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగాన్ని పాక్ టీవీ ఛానల్స్ సెన్సార్ చేశాయని, ఆయన స్పీచ్ అంటే వాటికి భయమని అర్నబ్ పాక్ లాయర్ జహీద్ సహీద్ తో అన్నారు. దీనికి జహీద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆగస్టు 4 న ఈ చర్చ ప్రసారమైంది. బెలూచిస్తాన్ విషయంలో భారత జోక్యం పై ఆ తరువాత జరిగిన చర్చా కార్యక్రమంలోనూ ఇదే వరస ! పాక్ పానెలిస్ట్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అయిన సుల్తాన్ అలీ హలీకి, అర్నబ్ కు మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. సెప్టెంబరు 22 న ప్రసారమైన చర్చాగోష్టి లో..సుప్రీంకోర్టు లాయర్ షబ్నం లోనె ని పాకిస్తానీ అపాలజిస్ట్ గా అర్నబ్ అభివర్ణించారు. భారత గడ్డపై పాక్ కు అనుకూలంగా మాట్లాడుతున్న హిపోక్రాట్ గా ఆమెను విమర్శించారు. అయితే తమ చర్చా కార్యక్రమాలను టైమ్స్ నౌ సమర్థించుకుంది. వివిధ వర్గాల అభిప్రాయాలను తమ కార్యక్రమాలు ప్రతిబింబించాయని, వేర్వేరు సమస్యలపై జరిగే చర్చలు ఒక్కోసారి అనుకూలంగాను, ప్రతికూలంగాను ఉండవచ్చునని, దీనిపై రాద్ధాంతం తగదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com