ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు

- May 13, 2017 , by Maagulf
ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు

ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పుణెకు బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. ప్లేన్‌ను తిరిగి శంషాబాద్‌ రప్పించారు. అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో అందులో 96 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళనకు దిగారు. నిన్నరాత్రి 8న్నర గంటలకు ఎయిరిండియా విమానం టేకాఫ్ అయింది. 20 నిమిషాల జర్నీ తర్వాత అందులో సమస్య తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్.. ATCకి సమాచారం అందించాడు. వాళ్లు వెనక్కు వచ్చేయాల్సిందిగా చెప్పారు. దీంతో.. వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి.. శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com