బరువు తగ్గాలంటే.. అరటి దూట, గరిక రసాన్ని సేవించండి
- May 14, 2017
శరీర బరువును తగ్గించాలంటే.. జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మనం తీసుకుంటున్న ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా జీలకర్ర నానిన నీటిని సేవించాలి.
జీలకర్రతో కలిపిన నీటిని సేవించడం ద్వారా అధిక బరువుతో కూడిన కండరాలు కరిగిపోతాయి. సొరకాయను వారానికి మూడుసార్లు ఉపయోగించాలి. వీటితో పాటు బొప్పాయిని తినాలి. మందార వేళ్లను నీటీలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు.
ఇంకా లెమన్ టీ సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. అరటి దూటల రసాన్ని సేవించడం, గరిక రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది. రోజూ ఉసిరికాయ రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. వీటితో పాటు ఉదయం పూట అరగంట వాకింగ్ చేయడం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







