బాలిక కిడ్నాప్ హత్య: వాట్సాప్ రూమర్ మాత్రమే
- May 15, 2017
ఓ బాలిక కిడ్నాప్ చేయబడి, హత్యకు గురైనట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తని ఫేక్ న్యూస్‌గా రాయల్ ఒమన్ పోలీసులు ధృవీకరించారు. ఏడేళ్ళ బాలికని ఒమన్‌కి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని, అలా కిడ్నాప్‌కి గురైన బాలిక విగతజీవిగా దొరికిందని సోషల్ మీడియాలో ఓ వార్త సర్క్యులేట్ అయ్యింది. కిడ్నాప్‌పై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, పోలీసుల విచారణలో బాలిక మృతదేహం దొరికిందని ఆ ఫేక్ వార్తలో పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేయడం మంచిది కాదని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు సూచించాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







