అభిమానులతో సమావేశం కానున్నసూపర్ స్టార్ రజినీకాంత్
- May 15, 2017
2009లో శివాజీ సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్స్‌తో సమావేశమైన రజనీ, మళ్లీ ఇన్నాళ్లకు వారికి సమయం కేటాయించారు. ఇవాళ్టి నుంచి మే 19 వరకు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో 5 రోజుల పాటు బ్యాచ్‌ల వారీగా తన అభిమాన సంఘాల ప్రతినిధులతో రజనీ భేటీ అవుతున్నారు. గత ఎనిమిదేళ్లలో ఫ్యాన్స్‌తో కేవలం ఫొటోలు మాత్రమే దిగి వారికి చాలా తక్కువ టైం కేటాయించిన తలైవా.. తాజాగా వారితో సమావేశమయ్యేందుకు ప్రత్యేకంగా 5 రోజులు కేటాయించడం విశేషం. ఈ సమావేశాల్లో తలైవాతో ఫోటో దిగాలని అనుకున్న అభిమానులు తప్పని సరిగా ఐడీ కార్డుతో రావాలని రజినీ అభిమాన సంఘం నోటీసులో పేర్కొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆయన అభిమానుల్లో క్రేజ్ చాలా ఉంది. రజినీని స్వయంగా కలుసుకుని ఆయనతో సెల్ఫీ దిగే అవకాశం వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఎక్కువగా ఆయన అభిమానుల నుంచి చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడీ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రతి ఏడాది అభిమానులను సమావేశపరిచి వారిని రజినీకాంత్ కలుసుకునేవారు. కానీ శివాజీ చిత్రం తరువాత రజిని మళ్లీ అభిమానులతో సమావేశం నిర్వహించలేదు. అభిమానులతో సమావేశంలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో రజినీ పొలిటికల్ ఎంట్రీకి అనుకూల వాతావరణం ఉంది. దీంతో తలైనా తన అభిమానులను సంప్రదించి వారి నుంచి సూచనలు సలహాలు తీసుకుంటారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









