చిన్న చిన్న ఉల్లంఘనలకు నో బ్లాక్‌ పాయింట్స్‌!

- May 15, 2017 , by Maagulf
చిన్న చిన్న ఉల్లంఘనలకు నో బ్లాక్‌ పాయింట్స్‌!

అబుదబీ పోలీసులు, చిన్న చిన్న ఉల్లంఘనలకు పాల్పడ్డ మోటరిస్టులపై బ్లాక్‌ పాయింట్లను రద్దు చేయనున్నారు. కొత్త పెనాల్టీస్‌, అలాగూ రూల్స్‌ జులై 1 నుంచి అమల్లోకి రానున్న దరిమిలా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవస్తోంది. అయితే పెద్ద పెద్ద ఉల్లంఘనల విషయంలో మాత్ర కఠిన చర్యలు తప్పవనీ, జరీమానాలు, శిక్షలు, బ్లాక్‌ పాయింట్స్‌ యధావిదిగా ఉంటాయన్నారు. పెద్ద ఉల్లంఘనల పరిధిలోకి ర్యాష్‌ డ్రైవింగ్‌, రెక్లెస్‌ డ్రైవింగ్‌, జంపింగ్‌ రెడ్‌ లైట్స్‌, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వంటివి వస్తాయి. ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌లో భాగంగా చిన్న చిన్న ఉల్లంఘనల్ని రద్దు చేయడం ద్వారా వాహనదారులు తమ తప్పు తెలుసుకుని, ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వాహనదారులు ఈ కొత్త నిర్ణయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com