మిలాహా డోర్‌ టు డోర్‌ షిప్పింగ్‌ ప్రారంభం

- May 15, 2017 , by Maagulf
మిలాహా డోర్‌ టు డోర్‌ షిప్పింగ్‌ ప్రారంభం

మెరిటైమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ కాంగ్లోమిరేట్‌ బేస్డ్‌ ఇన్‌ ఖతార్‌ - మిలాహా, డోర్‌ టు డోర్‌ షిప్పింగ్‌ సర్వీస్‌ని ఖతార్‌ - యూఏఈ మధ్య ప్రారంభించింది. ఆటోమోటివ్‌ స్పేర్‌ పార్ట్స్‌, ఫ్యాషన్‌ రిటైల్‌, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ సెక్టార్‌కి సంబంధించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్ని తాము టార్గెట్‌ చేసినట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ఈ సర్వీస్‌ ప్రారంభం కావడానికి వారం రోజులు పట్టవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులు, తమ కార్గో మూమెంట్స్‌పై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. మిలాహా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ ఇస్సా అల్‌ మనాయ్‌ మాట్లాడుతూ, క్లయింట్స్‌ అలాగే పార్టనర్స్‌కి తక్కువ ధరల్లోనే అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com