కేరళ రొయ్యల పచ్చడి
- May 18, 2017కావాల్సిన పదార్థాలు: రొయ్యలు - పావు కిలో, ఉప్పు - 2 టీస్పూన్లు, కారం - 4 టీస్పూన్లు, పసుపు - 1 టీస్పూను, అల్లం - 60 గ్రాములు, వెల్లుల్లి -60 గ్రాములు, పచ్చిమిర్చి - 10, వినెగర్ - పావు కప్పు, నువ్వుల నూనె - 1 కప్పు.
మసాలా పొడి కోసం:
ఉప్పు - ఒకటిన్నర టీస్పూను, గరం మసాలా - 1 టీస్పూను, కారం - 1 టేబుల్‌స్పూను, మిరియాల పొడి - 2 టీస్పూన్లు, పసుపు - 2 టీస్పూన్లు (వీటన్నిటినీ కలిపి పెట్టుకోవాలి).
తయారీ: రొయ్యల్లో 2 టీస్పూన్ల ఉప్పు, పసుపు వేసి అరగంట నానబెట్టాలి. తర్వాత రొయ్యల్లో ఊరిన నీటిని వంపేయాలి. బాండీలో అర కప్పు నూనె వేసి కాగాక రొయ్యలు, కారం వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద 5 నిమిషాలు వేగించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత బాండీలో నుంచి తీసి వేరే గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి కలిపి మరీ మెత్తగా కాకుండా మధ్యస్తంగా రుబ్బుకోవాలి. అదే బాండీలో మిగతా నూనె పోసి అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి చిన్న మంట మీద పచ్చి వాసన పోయేవరకూ వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, మసాలా పొడి, ఉప్పు కూడా వేసి ఓ నిమిషంపాటు వేగించాలి. వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి, పావు కప్పు వెనిగర్ పోసి కలపాలి. చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి.
పచ్చడి పొడిగా తయారై నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లారబెట్టాలి. పూర్తిగా చల్లారాక పొడిగా ఉన్న జాడీలో నింపుకోవాలి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







