ఔరా! ఎంత మాటన్నారు!!
- May 18, 2017
ఏపీ పారిశ్రామిక ప్రగతివైపు దూసుకుపోతోందన్నది తెలుగు దేశం నేతలు చెప్పేమాట. ఇప్పటికే సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్ నుంచి అమరావతి బాట పట్టాయని అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాయి పసుపు దళాలు. మరి ఇంతకీ వాస్తవం ఎలా ఉంది. మేథాటవర్స్ లో ఇటీవలే కొన్ని ఐటీ కంపెనీలు పనులు ప్రారంభించాయి.
దీనికితోడు ఇప్పటికే విశాఖ పట్నంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సులను క్రియేట్ చేసి యువతకు ఐటీ రంగంలో ఉపాధి కల్పించాలన్నది మంత్రి లోకేశ్ డ్రీమ్. మరి ఇలాంటి నేపథ్యం ఉంటే.. ఓ ఆంధ్రా మంత్రి మాత్రం ఏపీలోని సాఫ్ట్ వేర్ పరిశ్రమల పరువు తీసేశాడు. ఏపీలోని సాఫ్ట్ వేర్ కంపెనీలపై పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఒకటే విమర్శలు గుప్పించారు.
విశాఖపట్టణంలో పారిశ్రామికవేత్తలతో నోవాటెల్ హోటల్లో జరిగిన సదస్సులో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేదని కామెంట్ చేశారు. అలాంటి ప్రాజెక్టులు చేయగలమని నిరూపించుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ సర్వీసులు ఇక్కడి వారికి కేటాయిస్తామని వ్యాఖ్యానించారు మంత్రి అమర్ నాథ్ రెడ్డి. మరి ఐటీ రంగం గురించి నిత్యం కొట్టే డప్పు అంతా కేవలం భజన మాత్రమేనా..!?
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







