ఈ నెల 21-24 దక్షిణ చైనా సముద్రంలో భారత్-సింగపూర్ నేవీల విన్యాసాలు
- May 19, 2017
- మే 18 -20 వరకూ హార్బర్‌లోనూ..
- 21-24 వరకూ సీలోనూ సైనిక విన్యాసాలు
భారత్-సింగపూర్ నేవీల మధ్య ద్వైపాక్షిక సహకారంలో భాగంగా సింబెక్స్-2017 పేర దక్షిణ చైనా సముద్రంలో శుక్రవారం ఇరుదేశాల సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భారత నౌకాదళం నుంచి ఈ నెల 12న ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, కామర్తో రెండూ చేరుకుని తొలి విడత హార్బర్ లో 18 నుంచి 20వ తేదీ వరకూ జరిగే విన్యాసాల్లో పాల్గొననున్నాయి. రెండో దఫా సముద్రంలో 21 నుంచి 24వ తేదీ వరకూ నిర్వహించే విన్యాసాలకు పి8-1 మేరీటైం పెట్రోల్ యాంటీ సబ్‌మెరైన్ యుద్ధవిమానం, ఐఎన్‌ఎస్ శివాలిక్, జ్యోతి వెళ్లనున్నాయి. భూ ఉపరితలం, గగనతలంలో ఇరు దేశాల ఎయిర్ డిఫెన్స్ విన్యాసాలు అత్యంత కన్నుల పండుగగా జరుగనున్నాయి. ద్వైపాక్షిక నేవల్ ఎక్సర్‌సైజెస్‌లో సింగపూర్ ఫోకర్ ఎఫ్-50 యుద్ధవిమానాన్ని ప్రదర్శించుతోంది. సింగపూర్ దేశ అధ్యక్షులు లైచుంగ్‌హన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాలు అనేక అంశాల్లో 'కామన్ అండర్‌స్టాండింగ్'తో నడుచుకోవాల్సిన అవసరాన్ని ఈ విన్యాసాలు తెలియజేస్తున్నాయన్నారు. రక్షణ వ్యవహారాల్లో తగు జాగ్రత్తలను పెంపొందించుకునే దిశగా పరస్పరం విన్యాసాలు చేపడుతున్నాయన్నారు.
2016లో విశాఖలో జరిగిన ఐఎఫ్‌ఆర్ సందర్భంగా సింగపూర్ దేశాధ్యక్షులు లై చుంగ్ హ్యాన్ హాజరై భారత నావికాదళ ప్రతిభను కొనియాడారు. భారతనావికాదళానికి చెందిన నౌకలు, కెప్టెన్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







