నేనిప్పుడు పక్కా తమిళుడ్ని: సూపర్ స్టార్ రజినీకాంత్
- May 19, 2017
కర్నాటక సంతతికి చెందిన వాడంటూ తనపై విమర్శలు సంధిస్తున్నవారికి తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గట్టికౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. తొలిరోజు మాట్లాడిన దానికంటే కాస్త స్వరం పెంచి తన మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ''కర్నాటకలో నేను 23 యేళ్లు ఉన్నాను. తమిళనాడులో 43 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. నేను కర్నాటక నుంచి వచ్చినా... మీరు సాదరంగా ఆహ్వానించారు. నన్ను నిజమైన తమిళుడిగా మార్చారు..'' అని రజినీ వ్యాఖ్యానించారు.
పనిలో పనిగా ప్రస్తుత రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందించారు. ''ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ప్రజల గురించి ఆలోచించడం లేదు. ప్రజలంటే కనీసం పట్టింపు కూడా లేదు. ఈ పరిస్థితి మారాలి'' అని రజినీ పేర్కొన్నారు. అందరిలాగానే తనకు పనులు, బాధ్యతలు ఉన్నాయనీ ప్రస్తుతం వాటి మీద దృష్టి పెడదామన్నారు. అయితే తప్పనిసరిగా పోరాటం చేయాల్సివస్తే మాత్రం.. అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
తాజా వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల్లోకి రావడం తథ్యమన్న వాదనలకు బలం చేకూరినట్టయింది. అయితే రాజకీయ రంగప్రవేశంపై రజినీ ఇంకాస్పష్టతా ఇవ్వకపోవడంతో సస్పెన్స్ అలానే కొనసాగుతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియా గురువారం రజినీకాంత్‌ను ప్రశ్నించగా.... ''దయచేసి రాజకీయంపై ప్రశ్నలు అడగకండి'' అని పేర్కొన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







