రూ.1500 కోట్ల తో అల్ ఇండియా ఇండస్ట్రీ రికార్డు సాదించిన బాహుబలుడు
- May 19, 2017
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి-2’ మరో ఘనత దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని కలెక్షన్లతోదూసుకెళ్తున్న ఈ చిత్రరాజం రూ.1500కోట్ల వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. తొలి పది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్లు సాధించిన ఈ చిత్రం 22 రోజుల్లో రూ.1500కోట్ల మార్కును చేరుకుంది. భారత్లో రూ.1,227 కోట్లు, ఓవర్సీస్లో రూ.275 కోట్లు కలుపుకొని మొత్తంగా రూ.1,502కోట్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. బాహుబలి-2 హిందీలోనే దాదాపు రూ.500 కోట్లు సాధించినట్లు సమాచారం. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ‘బాహుబలి-2’ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటింది.
ఈ సందర్భంగా దేవసేన, శివగామి పాత్రలతో కూడిన పోస్టర్ను విడుదల చేసిన ‘బాహుబలి’ చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యంలో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ నటించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









