రమదాన్ కు ముందుగా తనిఖీలను కఠినతరం చేసిన కువైట్ మునిసిపాలిటీ

- May 19, 2017 , by Maagulf
రమదాన్ కు ముందుగా తనిఖీలను కఠినతరం చేసిన కువైట్ మునిసిపాలిటీ

ముఖ్యంగా రమదాన్ సమీపించే నాటి నుండి కువైట్ మునిసిపాలిటీ, దుకాణాల పర్యవేక్షణలను కఠినతరం చేసింది. ఆయా దుకాణదారులను  పర్యవేక్షించడం మరియు వినియోగదారులతో నేరుగా వ్యవహరించి వారికి ఆహారాన్ని అమ్ముతుండే వ్యాపారులపై తనిఖీలు నిర్వహించాలని మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు మరియు సాంకేతిక కమిటీ ఛైర్మన్ ఫహ్ద్ అల్-సేన్ పిలుపునిచ్చారు.  ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిన కారణంగా కొందరు కార్మికులు ఎంతటి ఖర్చుకైనా వెనకాడటంలేదని దీనితో ఆహార దుకాణ వ్యాపారులు పవిత్ర నెలను వారికి లాభసాటిగా మార్చుకొంటున్నారని ఆయన అన్నారు. వినియదారులను మోసగించడం లేదా మానవ వినియోగం కోసం అసమర్థమైన వస్తువుల అమ్మకం విషయంలో వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించడానికి మునిసిపాలిటీ హాట్లైన్లను సక్రమం చేయాలని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com