అతివేగమే ప్రాణాలను తీసిందని ధృవీకరించిన బెంజ్ ప్రతినిధులు
- May 19, 2017
బాప్రే!.. అంత వేగమా?.. అంటూ నిషిత్ కారు ప్రమాదంపై బెంజ్ కంపెనీ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఎపి మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ్ కారు యాక్సిడెంట్ పై పరిశీలించేందుకు జర్మనీ నుంచి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని యాక్సిడెంట్ స్పాట్ ను, నుజ్జునుజ్జయిన కారుని పరిశీలించారు. జపాన్, హాంకాంగ్, ఢిల్లీ, పుణెకు చెందిన బెంజ్ కార్ల నిపుణులు, ఓ లీగల్ అడ్వైజర్‌తో కూడిన పదిమంది సభ్యుల బృందం ప్రమాదం తీరుని పరిశీలించింది. ప్రమాదం జరిగిన సమయలో కారు 210 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విషయం తెలిసి అవాక్కయ్యారు. ట్రాఫిక్‌లో అంతవేగం ఎలా సాధ్యపడిందని ఆరా తీయగా, తెల్లవారుజామున కావడంతో ట్రాఫిక్ ఉండదని పోలీసులు వారికి వివరించారు. మెట్రో పిల్లర్ నిర్మాణం, మూలమలుపు, వర్షం కురిసిన సమయంలో రోడ్డు పరిస్థితి తదితర వివరాలను మెట్రో అధికారుల నుంచి సేకరించారు. కారు వేగం గంటకు 80-120 కిలోమీటర్ల మధ్య ఉన్నట్టయితే ఆయన బతికే అవకాశం ఉండేదని, కారులోని సెక్యూరిటీ సిస్టం, ఎయిర్‌బ్యాగ్స్, సీటు బెల్టులు సరిగానే పనిచేస్తున్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







