9వ ఇ-గవర్నమెంట్‌ అవార్డ్‌: నామినేషన్లకు ఆహ్వానం

- May 19, 2017 , by Maagulf
9వ ఇ-గవర్నమెంట్‌ అవార్డ్‌: నామినేషన్లకు ఆహ్వానం

మనామా: 9వ ఎడిషన్‌ ఇ-గవర్నమెంట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ 2017 కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ఇ-గవర్నమెంట్‌ అథారిటీ (ఐజిఎ) ఈ విషయాన్ని వెల్లడించింది. బెస్ట్‌ ఇ-గవర్నమెంట్‌ వెబ్‌సైట్‌, బెస్ట్‌ గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ ఇ-సర్వీస్‌, బెస్ట్‌ ప్రాక్టీస్‌ ఇన్‌ కమ్యూనిటీ ఇ-పార్టిసిపేషన్‌, బెస్ట్‌ ఇ-గవర్నమెంట్‌ ఇంటెగ్రేటెడ్‌ సర్వీసెస్‌ ఫర్‌ ఇండివిడ్యువల్స్‌ లేదా బిజినెస్‌ ఈ ఏడాది అవార్డు కేటగిరీలో ముఖ్యమైనవి. మల్టీ సెక్టార్‌ అవార్డు కేటగిరీల్లో బెస్ట్‌ అప్లికేషన్‌ ఫర్‌ స్మార్ట్‌ డివైజెస్‌, సిటిజెన్‌ అవార్డు కేటగిరీల్లో బెస్ట్‌ ఇ-కాన్సెప్ట్‌, ఇ-సిటిజన్‌ వంటివి ఉన్నాయి. జూన్‌ 22 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వెబ్‌సైట్‌ లేదా నేషనల్‌ కాంటాక్ట్‌ సెంటర్‌ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది అవార్డుల ఫోకస్‌, ఖర్చు తక్కువతో, మెరుగైన సర్వీసులను అందించే ఇన్నోవేటివ్‌ అప్లికేషన్స్‌పై పెట్టినట్లు ఐజిఎ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మొహమ్మద్‌ అలి అల ఖయీద్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com