పైనాపిల్ హల్వా
- May 19, 2017
కావలసినవి: పైనాపిల్స్ రెండు (తొక్కు తీసి, కడిగి, రెండున్నర సెంటీమీటర్ల సైజులో ముక్కలుకోసి పెట్టుకోవాలి), నెయ్యి 200 గ్రాములు, కుంకుమ పువ్వు కొద్దిగా, చక్కెర 500 గ్రాములు, పచ్చికోవా 250 గ్రాములు, స్పాంజి కేక్ ఒకటి (పావు కిలోది), అలంకరణకు - పిస్తా, ఆల్మండ్లు కొంచెం కొంచెం, క్రీమ్ ఒక కప్పు
తయారుచేసే విధానం
నెయ్యి వేడిచేసి కుంకుమ పువ్వు, పైనాపిల్ ముక్కలువేసి పది నిమిషాలు వేగించాలి. ముక్కలు మెత్తబడ్డాక చక్కెర, పచ్చికోవా, మూడో వంతు స్పాంజి కేక్ (కోవా, కేక్‌లను చేత్తో నలిపి వేయాలి) లను వేసి 20-30 నిమిషాలసేపు హల్వా చిక్కబడేదాకా ఉంచాలి. మిగిలిన పచ్చికోవా, స్పాంజి కేక్‌లను పైనచల్లి మరోసారి కలపాలి. చివర్లో సన్నటి ముక్కలుగా కోసుకున్న పప్పుల్ని, క్రీంను పైనవేసి వడ్డించండి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









