ప్రకాశం జిల్లా వేమవరంలో పడగవిప్పిన ఫ్యాక్షన్
- May 19, 2017
ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరంలో గొట్టిపాటి-కరణం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కె.రాజుపాలెంలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనాలపై వస్తున్న కరణం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చిలకలూరుపేటలోని వైద్యశాలకు తరలిస్తుండగా అంజయ్య, రామ కోటేశ్వరరావులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు చికిత్స పొందుతున్నారు. పాతకక్షల నేపథ్యంలో కరణం బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేసినట్లు తెలిసింది.
బాధితులను పరామర్శిచిన ఎమ్మెల్సీ
దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కరణం బలరాం నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల చక్రబంధంలో బల్లికురువ
ఫాక్షన్ హత్యల నేపథ్యంలో బల్లికురువ మండలం పోలీసులు బందోబస్తును పెంచారు. వేమవరం గ్రామంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ త్రివిక్రమవర్మ వేమవరంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నలుగురు డీఎస్పీలు వేమవరంలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
సీఎం ఆగ్రహం
బల్లికురువ మండలం వేమవరం వద్ద జరిగిన హత్యలపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదన్నారు. తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







