సెమీస్‌లో సానియా మీర్జా జోడీ
- May 19, 2017
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా సీజన్లో మరో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. నూతన భాగస్వామి యరస్లోవ ష్వెడొవా (ఖజకిస్థాన్)తో కలిసి మహిళల డబుల్స్‌లో సెమీ ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇటలీ జోడీ సారా ఎరానీ, మటియె ట్రెవిసన్‌పై వరుస సెట్లలో గెలుపొందారు. సానియా జోడీ ఆధిపత్యం నడి చిన పోరులో 6-4, 6-1తో ఏకపక్ష విజయం సొంతమైంది. నేడు జరిగే సెమీఫైనల్లో మాజీ భాగస్వామి, స్విస్ స్టార్ మార్టినా హింగిస్, చన్ యంగ్ జన్ (చైనా) జోడీతో మూడో సీడ్ సానియా, యరస్లోవా తలపడనున్న ది. అంత కముందు ప్రీ క్వార్టర్స్‌లో ఉక్రెయిన్ అమ్మాయిలు వాకోవర్ ఇవ్వటంతో సానియా జోడీ నేరుగా క్వార్టర్స్‌కు చేరుకున్నది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









