రెండు తెలుగు రాష్ట్రాలలో మరో నాలుగు రోజులు వడగాడ్పులు
- May 19, 2017
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
► నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
► రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీలపైనే నమోదు
నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావ రణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించింది. రోహిణీ కార్తె దగ్గర పడుతుండటంతో ఎండలు మండిపోతు న్నాయి. ఉదయం 9 గంటల నుంచే వేడి గాలు లు వీస్తున్నాయి. జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. శుక్రవారం నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యా ప్తంగా చాలాచోట్ల 40 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ గా 45 డిగ్రీలు, నల్లగొండలో సాధారణం కంటే 4.8 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో వడదెబ్బతో శుక్రవారం 20 మంది మృత్యువాత పడ్డారు. అందులో 14 మంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిధిలోని వారే.
రాలిపోతున్న పక్షులు
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో జంతువులు, పక్షులు కూడా విలవిల్లాడుతు న్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురంలో తహసీల్దార్ కార్యాలయంతో పాటు క్వార్టర్స్ ఆవరణలో రావిచెట్లపై ఉన్న గబ్బిలాలు పదుల సంఖ్యలో చనిపోతున్నాయి.
అన్నమూ ఉడికిపోతోంది..
ఎండలు మండిపోతుండడంతో ఆ వేడికి అన్న మూ ఉడికిపోతోంది. జయశంకర్ భూపాల పల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన పెను మల్ల కృష్ణారెడ్డి, అంబిక దంపతులు చిన్న గిన్నెలో బియ్యాన్ని నానబెట్టి ఉదయం ఎండలో పెట్టారు. సాయంత్రానికల్లా ఆ బియ్యం ఉడికిపోయి అన్నంగా తయారైంది.
శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్ల్లో)
ప్రాంతం ఉష్ణోగ్రత
నల్లగొండ 46
రామగుండం 45.8
భద్రాచలం 45.4
ఖమ్మం 45.2
నిజామాబాద్ 44.9
ఆదిలాబాద్ 44.8
హన్మకొండ 44.5
మెదక్ 43.7
హైదరాబాద్ 42.5
హకీంపేట 40.7
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









