లైంగికదాడి కేసులో 'వికీలీక్స్' జూలియన్ అసాంజేకు ఊరట
- May 19, 2017
- కేసు దర్యాప్తు నిలిపివేస్తున్నామని స్వీడన్ ప్రకటన
ఏడేండ్లుగా వెంటాడుతున్న లైంగిక దాడి కేసు నుంచి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు, విచారణలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు స్వీడన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదో ఒక విధంగా అసాంజేను దెబ్బతీయడానికి అమెరికా పన్నిన కుట్రలో భాగమే ఈ లైంగిక దాడి కేసు. దీని నుంచి తప్పించుకునేందుకు...లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అసాంజే రాజకీయ ఆశ్రయం పొందాల్సి వచ్చింది. గడిచిన ఐదేండ్లుగా ఆయన అక్కడే తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. కేసు విచారణ పేరుతో అరెస్టు చేయటమే ప్రధాన లక్ష్యమని, అరెస్టు చేసిన వెంటనే స్వీడన్ తనను అమెరికాకు అప్పగిస్తుందని మొదట్నుంచీ అసాంజే చెబుతూ వస్తున్నారు.
స్వీడన్ ప్రభుత్వం తన ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకోవడంతో అసాంజేకు స్వేచ్ఛ లభించినట్టేనని వికీలీక్స్ అభిమానులు పేర్కొన్నారు. అయితే, అతను బయట అడుగుపెట్టిన మరుక్షణం అమెరికా అతణ్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. అమెరికా అరెస్టు వారెంట్ బ్రిటన్ అమలుజేస్తుందా ? లేదా ? అన్నదానిపై స్పష్టత లేదు. కాబట్టి ఇప్పుడప్పుడే అసాంజే ఈక్వెడార్ ఎంబసీ నుంచి బయటికిరాకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం.
కేసు వేసిన అమ్మాయి సీఐఏ ఏజెంట్ !
2012లో స్వీడన్ రాజధాని స్టాకహేోమ్‌లో వికీలీక్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో పాల్గొన్న ఓ అమ్మాయిని తన గదికి పిలిపించుకున్న అసాంజే... లైంగిక దాడికి పాల్పడ్డాడని స్టాకహేోమ్‌లో కేసు నమోదైంది. అయితే తామిద్దరం పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని, తనపై అమెరికా కుట్ర పన్ని ఈ కేసు బనాయించారని అసాంజే వాదించారు. సదరు మహిళ సీఐఏ ఏజెంట్ అని కూడా అసాంజే నిరూపించే ప్రయత్నం చేశారు. అనంతరం స్టాకహేోమ్ అధికారులు అసాంజే అరెస్టుకు ఆదేశించారు. అరెస్టు నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆయన ఈక్వెడార్ ఎంబసీని ఆశ్రయించారు. ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అసాంజే, వికీలీక్స్ ద్వారా కీలకమైన దేశాల కార్యకలాపాలకు సంబంధించిన రహస్య పత్రాలను లీక్ చేయడం భారీ సంచలనాలకు కారణమైన సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఇండియా, పాకిస్థాన్ లాంటి పెద్ద పెద్ద దేశాల్ని వికీలీక్స్ గడగడలాడించింది. ఆ దేశాల్లోని రాజకీయ, ప్రభుత్వ కుట్రల్ని తెలిపే పత్రాల్ని బహిర్గతం చేసింది. ముఖ్యంగా అమెరికా సైనిక కుట్రల్ని, దౌత్య నీతిని వికీలీక్స్ బట్టబయలు చేసింది. వివిధ దేశాల్లో అంతర్యుద్ధాల్ని ఎలా సృష్టించింది ? యుద్ధాలకు ఎలా తెరలేపింది ? తీవ్రవాదాన్ని ఎలా సృష్టించింది ? వంటి విషయాల్ని తెలియజేసే పత్రాలు విడుదల చేసింది. దీంతో అసాంజే అంతుచూస్తానని అమెరికా బాహాటంగానే ప్రకటించింది. తాజాగా గురువారం కూడా సీఐఏ అధికారులు మాట్లాడుతూ 'అజాంజేను అరెస్ట్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం'అని అన్నారు. అటు, సీఐఏని 'టెర్రరిస్టుల స్నేహితుడి'గా అసాంజే అభివర్ణించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







