సిరియాలో సెంట్రల్ హమా ప్రావిన్స్‌లో నరమేథం
- May 19, 2017
- 52 మందిని ఊచకోత కోసిన ఐసిస్ తీవ్రవాదులు
సిరియాలోని సెంట్రల్ హమా ప్రావిన్స్‌లో ఐసిస్ తీవ్రవాదులు 52మందిని ఊచకోత కోశారు. ఐసిస్ తీవ్రవాదులు సలామియా పట్టణానికి తూర్పుగా గల అకరబ్ అల్ సఫియా గ్రామం లోకి చొరబడి 52మందిని నరికివేశారని, మరో 45 మందిని గాయపరిచారని అధికార సానా వార్తా సంస్థ తెలిపింది. సలామియాలోని నేషనల్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ నూఫల్ సఫర్ మాట్లాడుతూ, తమ ఆస్పత్రికి 52 మృతదేహాలు వచ్చాయని, వారిలో 11మంది మహిళలు, 17మంది పిల్లలని చెప్పారు. వారిలో కొందరికి తలలు తెగివున్నాయని, మరి కొందరి అవయవాలు తెగిపోయాయని చెప్పారు. సైనిక బలగాలు, జాతీయ రక్షణ దళాలు ఆ గ్రామం నుండి దుండగులను తరిమికొట్టాయి. అలెప్పోకి సరఫరాలు అందించే ప్రధాన రహదారితో సంబంధాలు లేకుండా చేయడానికి ఐసిస్ తీవ్రవాదులు ప్రయత్నించారు. బుధవారం రాత్రి సైన్యం అలెప్పో ప్రావిన్స్‌కి తూర్పున 9గ్రామాలను విముక్తి చేసింది. ఐసిస్‌కి పటిష్ట స్థావరమైన రక్కాకి తూర్పున గల మరో రెండు గ్రామాలను కుర్దిష్ వైపిజి నేతృత్వంలో సిరియన్ డెమోక్రటిక్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జెనీవాలో సిరియా శాంతి చర్చలు జరుగుతున్నాయి.
సిరియా ప్రతినిధి బృందం నాయకుడు బషర్ అల్ జఫరీ మాట్లాడుతూ, ప్రభుత్వ చొరవతోనే ఈ క్రమం చేపట్టామని, ఇందులో ఎవరి జోక్యాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







