ఘనత సాధించిన విశాఖ పోర్ట్
- May 20, 2017
దేశంలోని అత్యంత క్లీన్ రెండో పోర్టుగా విశాఖ పోర్టును కేంద్ర ప్రభుత్వం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శనివారం ఢిల్లీలో పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు అందుకున్నారు. 2017 మార్చి 16 నుంచి 31 వరకూ పరిసరాల పరిశుభ్రతపై పోర్టు చేసిన కృషి, రోడ్లు, మౌలిక వసతుల ఏర్పాటు, పారిశుధ్యం అమలు, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సమాచారం, కమ్యూనికేషన్ నైపుణ్యం-అవగాహన అన్నింట్లోనూ విశాఖ పోర్టు ద్వితీయస్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







