వేసవిలో బార్లీ నీళ్లు తీసుకుంటే.. మేలేంటి
- May 20, 2017
వేసవిలో బార్లీ నీళ్లు సేవించడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బార్లీగింజల్ని నానబెట్టి ఉడికించి వడకట్టిన నీళ్లను వేసవిలో సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు.. దీన్ని తీసుకోవచ్చు.
డీహైడ్రేషన్ సమస్య అదుపులోకి రావడమే కాదు.. ఎండ ప్రభావం కూడా ఉండదు. మధుమేహం ఉన్నవారూ బార్లీ నీళ్లకు ప్రాధాన్యమిస్తే మేలు. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులుండవు. ఇన్సులిన్ కూడా అదుపు తప్పదు.
అలాగే ఉదయం పూట గ్లాసు బార్లీ నీళ్లు తాగితే చాలు. యూరినల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలోని టాక్సిన్లు ఇట్టే దూరమవుతాయి. మూత్రపిండం శుభ్రం కావడంతో పాటు.. కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి. అలా బరువును అదుపులోకి ఉంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









