అమెరికాలో ఆలాప్ నరసిపురా అనే మరో భారతీయ విద్యార్ధి మృతి
- May 21, 2017
అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కార్నెల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఆలాప్ నరసిపురా అనే స్టూడెంట్ ఈనెల 17నుంచి కనిపించకుండా పోయాడు. న్యూయార్క్ లోని ఫాల్ క్రిక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికిచేరుకొని పరిశీలించగా...అతన్ని నరసిపురగా గుర్తించారు. బుధవారం వరకు అతన్ని చూశామని తోటి విద్యార్ధులు అంటున్నారు. నరసిపుర మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ప్రవాస భారతీయులపై జాత్యహంకార దాడులు పెరుగిపోతున్న నేపధ్యంలో విద్యార్ధి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టూడెంట్ మృతికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదన్న పోలీసులు... అతను నివాసం ఉంటున్న ఇంట్లో, కాలేజీలను పరిశీలించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









