కువైట్ లో 'గల్ఫ్ స్పిక్ ' కంపెనీని సందర్శించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 20, 2017
ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తన పర్యటన నిమిత్తం కువైట్ లోని ప్రవాసాంధ్ర తెలుగు దేశం ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కువైట్ లోని ప్రముఖ చమురు సంస్థ 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' యాజమాన్యాన్ని కలిసి అక్కడ పనిచేస్తున్న ప్రవాసీయుల కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కువైట్ లోని ఉద్యోగ అవకాశాలు, కల్పిస్తున్న సదుపాయాలూ, వెసులుబాట్లు, జీవనోపాధికై పొట్ట చేత పట్టుకొని వచ్చే కార్మికులకు కువైట్ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' ను క్షుణ్ణంగా పరిశీలించి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి అత్యున్నత పరిమాణాలున్న పరిశ్రమలు కల్పించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఆయనతో పాటు ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ అధ్యక్షులు ముల్కల సుబ్బారాయుడు, వెంకట్ కోడూరి,రమేష్,కుమార్,మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్,సురేష్,రమణ,హరిబాబు తక్కెళ్ళపాటి తదితరులు పాల్గొన్నారు.



_1495348304.jpg)

తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







