'అల్లుడు శీను' కొత్త సినిమా ప్రారంభం

- May 21, 2017 , by Maagulf
'అల్లుడు శీను' కొత్త సినిమా ప్రారంభం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడిగా ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’లో నటించాడు. ఇప్పుడు ‘మేఘన ఆర్ట్స్‌’ నిర్మాణంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. కార్యక్రమానికి వివి.వినాయక్‌, బోయపాటి శ్రీను, లారెన్స్‌, ఎం.ఎస్‌ రాజు, రాజారవీంద్ర, బెల్లంకొండ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. వి.వి వినాయక్‌ క్లాప్‌ ఇవ్వగా బోయపాటిశ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com