ఐర్లాండ్ ప్రధాని పీఠానికి చేరువగా భారత సంతతి వైద్యుడు లియో వార్దార్కర్
- May 21, 2017
భారతదేశ మూలాలున్న వ్యక్తి.. ఐర్లాండ్ ప్రధాని పీఠం అధిష్ఠించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని పదవి రేసులో భారత సంతతి వైద్యుడు లియో వారద్కర్ దూసుకుపోతున్నారు. ఐర్లాండ్ పార్లమెంటు సభ్యులు, కేబినెట్‌లోని సీనియర్ సభ్యుల్లో చాలా మంది ఆయనకు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. జూన్ 2 లోగా ప్రధాని పదవికి ఎన్నిక జరగనుంది. పార్లమెంటు సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. వారద్కర్‌కు పోటీగా గృహకల్పన మంత్రి సిమోన్ కావనీ బరిలో ఉన్నారు. 38 ఏళ్ల వారద్కర్.. ప్రస్తుతం సామాజిక భద్రత శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. 2007లో తొలిసారి పార్లమెంటు సీటు దక్కించుకున్న ఆయన.. ఫైన్ గేల్ పార్టీలో వేగంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రభుత్వంలోనూ వివిధ మంత్రిత్వశాఖల బాధ్యతలు చేపట్టిన అనుభవం ఆయనకు ఉంది. ఐర్లాండ్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని గళమెత్తిన ప్రముఖుల్లో వారద్కర్ కూడా ఒకరు. 2015లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ఐర్లాండ్ అవతరించింది.
తాను స్వలింగ సంపర్కుడినన్న విషయాన్ని వారద్కర్ కూడా బహిరంగపరిచారు. ప్రధాని పీఠం దక్కితే.. దేశంలో ఈ పదవి చేపట్టిన తొలి స్వలింగ సంపర్కుడిగా చరిత్రకెక్కనున్నారు. వారద్కర్ తండ్రి అశోక్ వారద్కర్ ముంబయిలో జన్మించారు.
తాజా వార్తలు
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!









