మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం
- May 22, 2017
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఘనంగా నివాళులర్పించింది. ఆ మహోన్నత వ్యక్తికి అరుదైన సత్కారాన్ని ఇచ్చి తన గౌరవాన్ని రెట్టింపు చేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తమ శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ నూతన జీవికి కలాం పేరు మీదుగా నామకరణం చేసింది. బ్యాక్టీరియా రకానికి చెందిన ఈ జీవి భూమిపై ఎప్పుడూ కనిపించలేదు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్ ఫిల్టర్లపై ఈ నూతన జీవిని తొలిసారిగా గుర్తించారు. ఏరోస్పేస్ రంగంలో కలాం సేవలకు గుర్తింపుగా ఆ బ్యాక్టీరియాకు సొలిబాసిల్లస్ కలామైగా నామకరణం చేసినట్లు జేపీఎల్ సీనియర్ శాస్త్రవేత్త కస్తూరీ వెంకటేశ్వరన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









