మాంచెస్టర్ అరెనాలో సంగీత కచేరీపై ఆత్మాహుతి దాడి: 19 మంది మృతి
- May 22, 2017
ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ అరెనాలో అరేనా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న ప్రాంతంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంగీత కచేరి ప్రాంతంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సంఘటనలో 19 మంది మరణించారని, 50 మంది గాయపడ్డారని పోలీసులు ఓ ప్రకటనలో చెప్పారు. దాడి ఉగ్రవాదుల పనే అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాంబు డిస్బోజబులు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
సంఘటనా స్థలానికి రావద్దని పోలీసులు ప్రజలను కోరారు. ప్రజలు అక్కడికి చేరుకుంటే సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని అన్నారు. రెండు పేలుళ్లు సంభవించినట్లు మీడియా వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









