ఇ-రింగ్‌రోడ్‌పై పాదచారుల వంతెన త్వరలో ప్రారంభం
- May 23, 2017
ఇ-రింగ్ రోడ్‌పై పాదచారుల వంతెన, జూన్‌లో ప్రారంభం కానుంది. పాదచారులకు ఇది నిజంగానే ఓ వరం కానుంది. ఓల్డ్ ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీస్ (మురుర్) చేరుకునేవారికి ఇది ఎంతో వీలుగా ఉంటుంది. కార్మికులు తాజాగా 2 లేయర్ల 22 ఎంఎం లామినేటెడ్ టాంపర్డ్ గ్లాస్‌ని బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్నారు. 66.12 మీటర్ల పొడవైన బ్రిడ్జి ఎత్తు 12.5 మీటర్లు. అల్ తుమామా మరియు ఓల్డ్ ఎయిర్పోర్ట్ మధ్య దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అష్గల్ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారిపై బ్రిడ్జి నిర్మాణంతో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. జూన్‌లో ఈ బ్రిడ్జిని పాదచారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 15 పాదచారుల వంతెనల్ని నిర్మించేందుకోసం మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రకటన చేసింది. ఖతార్‌లోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









