హీరో చరణ్ పై హీరో అఖిల్ సంచలన వ్యాఖ్యలు
- May 23, 2017
నిన్న రాత్రి చిరంజీవి నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు అతిధిగా వచ్చిన అక్కినేని అఖిల్ తనకు రామ్ చరణ్ కు ఉన్న స్నేహం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. గత 5 ఏళ్లగా తమ మధ్య పెరిగిన బంధం గురించి మాట్లాడుతూ చరణ్ తనను ఒక తమ్ముడులా చూసుకుంటూ తన కెరియర్ కు సంబంధించి ఎన్నో సూచనలు ఇస్తున్న విషయాన్ని బయట పెట్టాడు.
అంతేకాదు తన కెరియర్ గురించి అదేవిధంగా తనకు తన అన్నయ్య నాగచైతన్యకు మధ్య ఉన్న బంధం గురించి కూడ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు అఖిల్. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తాను చిరంజీవి వీరాభిమాని అని చెపుతూ చిరంజీవి స్టెప్స్ కొన్ని వేసిచూపెట్టి మెగా అభిమానుల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించాడు.
అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ షోలో చిరంజీవి అడిగిన అనేక ప్రశ్నలకు అఖిల్ తడుముకోకుండా సమాధానాలు ఇచ్చాడు. ఆద్యంతం ఆసక్తిగా జరిగిన ఈ కారక్రమాన్ని మన ఇరు రాష్ట్రాలలోను చాలా మంది బుల్లితెర పై చూసారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా అఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీకి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
అఖిల్ ఫస్ట్ మూవీ ఫ్లాప్ తరువాత నాగార్జున ఎంతో కేర్ తీసుకొని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రాజెక్ట్ కి ఎందుకు బ్రేక్ పడిందని చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. దీనికి కారణం అఖిల్ కి సరైన హీరోయిన్ దొరకకపోవడమే షూటింగ్ కి బ్రేక్ పడడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్ గా మేఘనా ఆకాష్ పేరు అప్పట్లో అనుకున్నారు.
అయితే అది కుదరలేదు. దీనితో హీరోయిన్ ఎంపిక కాకుండానే ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ లో యాక్షన్ సీన్లు షూట్ చేసారు. నెక్స్ట్ షెడ్యూల్లో హీరోయిన్ కాంబినేషన్ లో సీన్లు ప్లాన్ చేసారట. కానీ హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ బ్రేక్ ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి. దీనితో గ్యాప్ దొరకడంతో అఖిల్ ఇలా చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో సందడి చేసి తన ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించాడు అనుకోవాలి.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









