మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగి 34 మంది శరణార్థులు మృతి

- May 24, 2017 , by Maagulf
మధ్యదరాసముద్రంలో  ఓ నౌక  మునిగి 34 మంది శరణార్థులు మృతి

రోమ్, మే 24: మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగిపోయిన ఘటనలో 34 మంది శరణార్థులు మృతి చెందారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. నౌకలో సామర్థ్యానికి మించి శరణార్థులు ప్రయాణిస్తుండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ఇటాలియన్ కోస్ట్‌కార్డ్ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. లిబియా తీరప్రాంతానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 34 మృతదేహాలను వెలికితీశామని, దాదాపు 200 మంది ప్రజలు సముద్రంలో పడిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 నుంచి 700 మంది వరకు శరణార్థులు ఉన్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, శరణార్థులకు లైఫ్‌జాకెట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com