ముంబై లో దారుణం తల్లి గొంతు కోసి.. నన్ను ఉరితీయమని ఆమె రక్తం తో లేఖ రాసిన కొడుకు
- May 24, 2017
పస్తుతం ఏ రిలేషన్ కు భద్రత లేదు.. తల్లిని బిడ్డ చంపడానికి వెనుకాడడం లేదు.. బిడ్డ తనను నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసింది అనే భావన లేకుండా చిన్న చిన్న కారణాలకు చంపడానికి ఆలోచించడం లేదు.. తాజాగా ఓ రాక్షసుడు తన తల్లిని గొంతు కోసి చంపేసి.. ఆమె రక్తంతో నేలపై ఓ నొత్ కూడా రాశాడు.. పైగా తల్లిని చంపిన కిరాతకుడు ఓ ఫేమస్ ఇన్ స్పెక్టర్ తనయుడు కావడం విశేషం.. వివరాల్లోకి వెళ్తే...
షీనా బోరా హర్యా కేసును దర్యాప్తు చేస్తోన్న బృందంలోని ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ గనోర్, భార్య దీపాలి, కొడుకు తూర్పు శాంతాక్రజ్‌లోని ప్రభాత కాలనీలో ఉంటున్నారు. బుధవారం ఉదయం ఆయన డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తలుపు బయట నుంచి తాళం వేసి ఉంది. తాళం చెవులు షూ ర్యాక్‌లో కనిపించాయి. దీంతో తాళం తీసి లోపలికి వెళ్లి చూసిన ఆయన నిశ్చేష్టుడయ్యాడు. భార్య రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. తెగిన గొంతు నుంచి ఉబికిన నెత్తురు కాలువలు కట్టింది. వెంటనే ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి భార్యను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు..కాగా తల్లిని గొంతు కోసి రక్తంతో ఆ గదిలో నేలపై 'నేను ఆమెతో విసిగిపోయాను. నన్ను పట్టుకుని ఉరి తీయండి' అని రాయడంతో ఈ హత్యను చేసింది జ్ఞానేశ్వర్ కొడుకే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనుమానితుడిగా భావిస్తున్న జ్ఞానేశ్వర్ తనయుడు మంగళవారం రాత్రి నుంచి పరారీలో ఉన్నాడు. అతని మొబైల్ ఫోన్‌ను ఇంట్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









