సాలిక్ ఛార్జీల నుంచి ఉపశమనం?
- October 08, 2015
'చాట్ విత్ ఆర్టిఏ' ద్వారా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, సాధారణ ప్రజలు 'ఆఫ్ పీక్ అవర్స్'లో సాలిక్ ఛార్జీలు లేకుండా ప్రయాణించే అవకాశం కోసం అధికారుల్ని అభ్యర్థించారు. ట్విట్టర్ ద్వారా ఆర్టిఏ ప్రజల మనోభావాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, షేక్ జాయెద్ రోడ్ విషయంలో సాలిక్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్లు రావడంతో, ప్రజల విజ్ఞప్తుల్ని పాలకులకు తెలియజేయడానికి ఆర్టిఏ అధికారులు ప్రయత్నిస్తున్నారట. అయితే దుబాయ్‌లో సౌకర్యాల కల్పన కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామనీ, సాలిక్ ఛార్జీలు ఉన్న రోడ్లపై ప్రయాణించే బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించడం మేలని ప్రజలకు ఆర్టిఏ సూచించింది. కనీసం వారంలో ఒక్కరోజు లేదా కొన్ని గంటలపాటు సాలిక్ ఛార్జీలు లేకుండా చేయాలని ప్రజలు ట్విట్టర్ ద్వారా ఆర్‌టిఎకి విజ్ఞప్తి చేశారు. 'ఛార్జీలు తగ్గించే ఆలోచన లేదు' అని ఆర్టిఏ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేయడంతో ప్రజలు నిరాశ చెందారు. పలు ప్రాంతాల్లో రోడ్లను విస్తరించడం, కొత్తగా రోడ్లను వేయడం వంటి ఎన్నో ప్లాన్స్ తమ దృష్టిలో ఉన్నాయని, ప్రజలు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని ఆర్టిఏ ట్విట్టర్లో పేర్కొంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







