కింగ్డమ్లో 9 మిలియన్ చెట్ల పెంపకం: రియాద్ గవర్నర్
- May 27, 2017
రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాటర్ అండ్ అగ్రికల్చర్ ఇనీషియేటివ్‌లో భాగంగా 1 మిలియన్ ట్రీస్‌ని రియాద్‌లో పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తంగా కింగ్డమ్లో 2020 నాటికి 4 మిలియన్ల చెట్లను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా రియాద్‌లోని ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ ప్యాలెస్ కంట్రీయార్డ్ వద్ద ఘాఫ్ ట్రీని నాటారు గవర్నర్ ప్రిన్స్ ఫైసల్. ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో లభించే ప్రత్యేకమైన చెట్టు ఘాఫ్. 30 మీటర్ల వరకు ఘాఫ్ ట్రీ వేర్లు భూమిలోకి చొచ్చుకుని వెళతాయి. ఇసుకలో కూడా ఈ చెట్లు పెరుగుతాయి. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయగలిగినవాళ్ళమవుతామని గవర్నర్ ఫైసల్ బిన్ చెప్పారు. కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో 800,000 మొక్కల్ని నాటనున్నారు. నర్సరీల నుంచి వీటిని సేకరిస్తున్నారు. జుల్ఫి, అల్ గాట్, షక్రా, అల్ ఖర్జ్ల్లోని నర్సరీలు ఈ మొక్కల్ని సరఫరా చేస్తున్నాయి.
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









