దుమ్ముపట్టిపోయిన వాహనాలకు జరీమానా
- May 28, 2017
అబుదాబీలోని పబ్లిక్ స్క్వేర్స్‌లో దుమ్ముపట్టిపోయి, వదిలివేయబడ్డ 170 కార్లకు జరీమానా విధించారు అధికారులు. అబుదాబీ సిటీ మునిసిపాలిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. 175 అఫెన్స్ టిక్కెట్స్‌ని ఆయా వాహనాల యజమానులకు పంపినట్లు తెలిపారు అధికారులు. వదిలివేయబడ్డ వాహనాలు దుమ్ముపట్టిపోయి, సిటీ అందాన్ని చెడగొడ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్యాంపెయిన్‌లో భాగంగా ఈ చర్యల్ని అబుదాబీ మునిసిపాలిటీ చేపట్టింది. పబ్లిక్ న్యూసెన్స్‌గా మారిన ఇలాంటి వాహనాల పట్ల ముందు ముందు ఇంకా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. వాహన యజమానులు ఆ వాహనాలు తమవేనని ధృవీకరించుకునేందుకు తగిన ఆధారాల్ని చూపించాల్సి ఉంటుందనీ, ఆ తర్వాత 3000 దిర్హామ్‌లు జరీమానా కట్టి, వాటిని తమతో తీసుకెళ్ళవచ్చునని వారు తెలిపారు. మూడు రోజులపాటు వాహనాన్ని గమనించి, దానికి స్టిక్కర్ అందిస్తారు అధికారులు. ఆ తర్వాత దాన్ని అక్కడినుంచి 24 గంటల తర్వాత తొలగిస్తారు. ఈలోగా వాహనాన్ని యజమానులు జరీమానా కట్టి విడిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే, ఆ తర్వాత ఇంకా కఠిన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









