వలసదారులకు క్షమాభిక్ష లేదు

- May 29, 2017 , by Maagulf
వలసదారులకు క్షమాభిక్ష లేదు

కువైట్:వీసా / రెసిడెన్సీ నిబంధనల్ని ఉల్లంఘించిన వలసదారులకు ఎలాంటి క్షమాభిక్ష లేదనీ, క్షమాభిక్షపై సోషల్‌ మీడియాలో వస్తున్న అవాస్తవ వార్తల్ని నమ్మరాదని కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ క్షమాభిక్ష ప్రకటించిందనీ, వీసా, రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఇదే మంచి అవకాశమని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఇండియన్‌ కమ్యూనిటీ ఈ విషయాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరి ట్రాప్‌లోనూ పడరాదని ఇండియన్‌ ఎంబసీ విజ్ఞప్తి చేసింది. సుమారుగా 29,000 మంది భారత జాతీయులు, కువైట్‌లో వీసా, రెసిడెన్సీ ఉల్లంఘనల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సాయం అందించేందుకు ఇండియన్‌ ఎంబసీ, లోకల్‌ అథారిటీస్‌తో కలిసి చర్యలు చేపడుతోంది. ఇంకో వైపున, కువైట్‌కి వచ్చేవారు, కువైట్‌లో ఉంటోన్న భారతీయులు ఖచ్చితంగా కువైటీ చట్టాలను, నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com