కొన్ని ఆరోగ్య చిట్కాలు

- April 25, 2015 , by Maagulf
  • పచ్చ కర్పూరము నూనెలో నానబెట్టి, ఆ నూనెను పడుకునే ముందు ఛాతి పైన బాగా మర్దన చేస్తే ముక్కు దిబ్బడ మరియు దగ్గునుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • కూరల్లో కరివేపాకును పక్కన పడేయకుండా ప్రతిరోజు తింటూ ఉన్నట్లైతే అనీమియా (రక్తహీనత) ను తగ్గిస్తుంది.అలాగే కరివేపాకుకు జీర్ణశక్తి మెరుగు పరిచే గుణముంది.
  • బాగా జ్వరం ఉన్నపుడు ధనియాల లేదా మెంతుల కషాయం ఆరారగా తాగిస్తే టెంపరేచర్ తగ్గుముఖం పడుతుంది. వీటికి శరీరంలోని విషపదార్ధాలను బయటకు పంపే గుణం ఉంది.
  • రోజుకు ఒక ఖర్జూరం తింటే మన రోజువారీ ఆహారంలో అందని పోషకాలన్నీ దీనితో సమన్వయం అవుతాయి. పాలలో ఖర్జూరాలను వేసి మరిగించి తాగితే పూర్తిస్థాయిలో ఆహారం తీసుకున్నట్లే.
  • కాకరకాయ బాక్టీరియాను నిర్మూలిస్తుంది. కడుపులో చేరే పరాన్న జీవులకి కాకర అంటే టెర్రర్.
  • శరీరంపై కాలిన చోట పాల మీగడరాస్తే బాధ తగ్గటమే కాదు, శరీరం రంగు మారుతుంది.
  • పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటారు. నారింజ తొనలలోని విత్తనలు తీసేసి, ఆతొనలను కాసేపు ఫ్రిజ్ లో ఉంచి వాటిని పిల్లలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇస్తుంది. వారికి అవసరమైన 'సి' విటమిన్ కూడ లభిస్తుంది.
  • గొంతులో ఇన్పెక్షన్ తగ్గాలంటే ఒక టీస్పూన్ తాజాఅల్లం రసం లేదా చిన్న అల్లం ముక్క, చిటికెడు మిరియాల పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి ఉదయం ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి తినాలి.
  • మంచి సువాసనతో ఉండే కొత్తిమీర అలసిన కళ్ళకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్తి మీర రసం మొటిమల మీద రాసుకుని, రాత్రంతా ఉంచి, మర్నాడు చల్లటి నీళ్ళతో కడుక్కుంటూ ఉంటే, కొన్నాళ్ళకు మంచి ఫలితం ఉంటుంది.ఎక్కువగా కొత్తిమీరను తీసుకుంటె వచ్చే నష్టమేమీ లేదట.
  • జుట్టు రాలకుండా, తెల్లబడకుండా ఉండాలంటే - ఆముదాన్ని వేడిచేసి తలకు రాసుకుంటే జుట్టురాలదు.
  • మెంతి ఆకులను మెత్తగా నూరి, ఆముద్దను తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానంచేస్తే జుట్టు ఊడదు. అంతే కాకుండా బాగా పెరిగి పట్టులా ఉంటుంది.
  • ఏలకులు అజీర్ణానికి, వాంతులకు, కాలేయ సంబంధ వ్యాధులకు మంచి ఔషదం.
  • కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి.
  • తాగే నీటిలో షాజీరాను వేసి పది నిముషాల పాటు వేడి చేసి తాగితే పొట్టలో నులి పురుగులు, చెడు శ్వాస సమస్యలు తగ్గుతాయి.
  • పాలకూరలో ఐరన్, కాలిష్యం, విటమిన్ ’ఎ’, విటమిన్ ’బి’, విటమిన్ ’సి’ అధికంగా ఉంటాయి. ఐరన్ తక్కువున్న వారు పాలకూర తీసుకుంటే ఐరన్ డెఫిసియన్సీ తగ్గుతుంది. గర్భవతులైన స్త్రీలు పాలకూర ప్రతిదినం తీసుకుంటే రక్త పెరుగుదల అంతేకాకుండా వారిలో ఎక్కువగా బాధ పడే మలబద్దకం సమస్య తీరుతుంది.
  • ఉల్లిపాయల్ని తరిగేటప్పుడు కళ్ళ నుండి నీళ్ళు రాకుండా ఉండాలంటే ప్రక్కన ఒక కొవ్వొత్తి వెలిగించండి.
  • పాలపై మీగడ ఎక్కువ దళసరిగా కావాలంటే పాలు కాచే గిన్నే మీద చిల్లులు ఉన్న మూతను పెట్టండి.
  • వెండి పాత్రలు ఆవపొడి తో తోమితే మిలమిలా మెరుస్తాయి.
  • ఆకు కూరలను న్యూస్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com