సీఎం కేసీఆర్ బయో పిక్ లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు
- May 31, 2017
బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ కూడా హిట్ కధల బాట పట్టింది.. అదే బయోపిక్ ల బాట పట్టింది.. ఇప్పటికే మహానటి సావిత్రి బయో పిక్ షూటింగ్ మొదలు పెట్టుకోగా.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించనున్నారు.. ఈ సినిమాకు మధుర శ్రీధర్ దర్శకత్వం వహించనుండగా... రాజ్ కందుకూరి నిర్మించనున్నారు.. కాగా కేసీఆర్ పాత్రలో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించనున్నట్లు దర్శక, నిర్మాత మధుర శ్రీదర్ తెలిపారు.. రాజ్ కుమార్ రావు కు కేసీఆర్ కు దగ్గర పోలికలు ఉంటాయని... అందుకనే తనని ఈ సినిమాలో నటింపజేయాలని అనుకున్నట్లు తెలిపారు.. ఇప్పటికే రాజ్ కుమార్ ను కలిసి కధ విపించగా.. ఆయన నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు.. తమిళంలో విజయ్ ఆంటోనీని.. హిందీలో రాజ్ కుమార్ ని అనుకున్నాం... మరి ఏ విషయం అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.. కాగా కేసీఆర్ బయో పిక్ '1967లో ప్రారంభమై, 2014 జూన్ '2కు ముగుస్తుంది. ఈ ఏడాదిలోనే చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇది లీడర్ కథ. తెలంగాణ-ఆంధ్రా ఉద్యమం నుంచి ప్రారంభమవుతుంది' అని మధుర శ్రీధర్ చెప్పారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









