రమదాన్: దుబాయ్ మాస్క్‌ల వద్ద ఉచిత పార్కింగ్
- May 31, 2017
మఘ్రిబ్ ప్రార్థనల కోసం మోటరిస్టులు దగ్గర్లోని మాస్క్‌ల వద్దకు వెళుతుంటారు. వీరికి ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) అధికారి ఒకరు వెల్లడించారు. ప్రార్థనల తర్వాత 45 నిమిషాల వరకు ఈ ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఇది కేవలం పార్కింగ్ ఏరియాస్ కోసం మాత్రమే వర్తిస్తుందనీ, ఇతర ప్రాంతాల్లో వాహనాలు నిలపరాదని అధికారులు స్పష్టం చేశారు. దుబాయ్‌లోని పెయిడ్ పార్కింగ్ స్లాట్స్కి సంబంధించి రమదాన్ సందర్భంగా అన్ని కార్లకు (ఎ,బి,సి,డి,జి జోన్లకు) టారిఫ్ని ప్రకటించింది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ధరల్ని ప్రకటించారు. పార్కింగ్ బ్రేక్ పీరియడ్ 5 గంటల నుంచి 7 గంటల వరకు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









