విశాఖలోజులై 15న ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో
- May 31, 2017
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జులై 15న విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్‌షోలో పాల్గొననున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి కార్యవర్గ సమావేశాలు జరిగే వేదిక వరకు రోడ్‌షో నిర్వహించాలని భాజపా రాష్ట్రనాయకులు భావిస్తున్నారు. గతంలో భువనేశ్వర్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని పాల్గొన్న రోడ్‌షోకు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పి.ఎం.పాలెం క్రికెట్ స్టేడియం పక్కనే ఉన్న ‘వి కన్వెన్షన్’ కేంద్రంలో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని భాజపా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానితో రోడ్‌షో నిర్వహించాలని భావిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు ‘ఈనాడు’కు వెల్లడించారు. రెండురోజుల్లో కార్యవర్గ సమావేశాల వేదిక ఎక్కడన్న అంశం ఖరారు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







