మణిరత్నంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
- June 02, 2017
భారత దేశంలో దర్శకుల్లో టాప్ టెన్ దర్శకుల లిస్ట్ తీస్తే.. ఆ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం.. మణిరత్నం ఎన్నో మేలిముత్యాల్లాంటి సినిమాలను అందించాడు.. తెలుగులో దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా గీతజంలి.
కానీ మౌనరాగం, నాయకుడు, రోజా, అంజలి, గీతాంజలి, చెలి.. ఇలా ఎన్నో ఆణిముత్యాల సినిమాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం పుట్టిన రోజు నేడు..
మణిరత్నం ముంబై లోని జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పట్టాను తీసుకొన్నారు.. కాగా మణిరత్నం బిజెనెస్ వైపు అడుగులు వేయకుండా సినిమా రంగం వైపు అడుగులు వేశారు.. బహుశా మణి తండ్రి రత్నం అయ్యర్.. వీనస్ స్టూడియో అధినేత కావడమే కారణం ఏమో..! మణి కన్నడంలో పల్లవి, అనుపల్లవి సినిమా కు దర్శకత్వం వహించి వెండి తెరపై అడుగు పెట్టాడు.. ఆ సినిమా ప్రశంసలను పొందింది కానీ ప్లాప్ గా మిగిలింది.. ఐనా మూస సినిమాలను తెరకెక్కించకుండా.. ఎన్నో కష్టానష్టాల కొర్చి సరికొత్త ఒరవడి దిద్దారు.. ఎన్నో సినిమాలు నేటి తరం దర్శకులకు రోల్ మోడల్స్ అని చెప్పవచ్చు.. ప్రముఖ నటి సుహాసిని ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.. ఈ దంపతులకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు.. ఎన్నో జనం మెచ్చిన సినిమాలను తెరకెక్కించిన మణిరత్నం కు గత కొంత కాలంగా సరైన హిట్ లేదు.. ప్రస్తుతం రామ్ చరణ్ తో యోధ సినిమా ను.. తమిళంలో దలపతి 2 ని తెరకెక్కించే సన్నాహల్లో ఉన్నారు.. రాశి కంటే వాసి ముఖ్యం అనుకొనే దర్శకుల్లో మణిరత్నం ఒకరు.. ఎన్నో ఆణిముత్యాలను అందించిన మణిరత్నం ఇటువంటి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకొంటూ శుభాకాంక్షలను తెలియజేద్దాం.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









