అల్లుఅర్జున్ నటించిన 'దువ్వాడ'కు తగిలిన బ్రాహ్మణుల సెగ
- June 02, 2017
అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'దువ్వాడ జగన్నాథం' ఫై ఎలాంటి అంచనాలు నెలకొనిన్నాయో చెప్పనవసరం లేదు..ఇటీవల రిలీజ్ అయినా సాంగ్స్ టీజర్స్ తో అంచనాలు తారాస్థాయికి వెళ్ళుతున్నాయి. టీజర్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ హ్యాపీ గా ఫీల్ అవుతున్న నేపథ్యం లో చిత్రానికి వివాదం చోటుచేసుకొని షాక్ ఇచ్చింది.
గతం లో రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్ ను వ్యతిరేకించిన బ్రాహ్మణ కులస్థులు, తాజాగా విడుదలైన 'అస్మైక భోగ, తస్మైక భోగ' అనే పాటపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రచయిత సాహితి రాసిన ఈ పాటలోని లిరిక్స్ లోని పదాలు 'నమకం.. చమకం' రుద్ర స్తోత్రాన్ని అవమానించేవిగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తొలిగించకపోతే పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్లతామని హెచ్చరిస్తున్నారు.
గతంలో కూడా మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంపై కూడా ఇలాంటి వివాదమే జరిగి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యం లో డీజే యూనిట్ ఆ లిరిక్స్ ను తొలిగిస్తారో లేక బ్రాహ్మణ కులస్థులతో మాట్లాడతారో చూడాలి. జూన్ 23 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత కాగా , పూజ హగ్దే హీరోయిన్.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









