అఖిల్ సూర్యకవచం

- October 10, 2015 , by Maagulf
అఖిల్ సూర్యకవచం

అక్కినేని వారసుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'అఖిల్'. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తన పేరునే టైటిల్‌గా ఎంచుకున్నారు. అయితే టాలీవుడ్‌లో 'అఖిల్'గా ఎంట్రీ ఇస్తున్న అఖిల్ కోలీవుడ్‌లో మాత్రం 'సూర్యకవచం'గా రాబోతున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'సూర్యకవచం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'సూర్యకవచం' చిత్రాన్ని తమిళంలో నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. 'అఖిల్' ఆడియో తెలుగులో ఇప్పటికే విడుదలైన శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ చిత్ర తమిళ ఆడియో వేడుకను చెన్నైలోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com