థాయిలాండ్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్
- June 04, 2017
హైదరాబాద్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన తెలుగు తేజం సాయి ప్రణీత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ పైనల్స్‌లో జొనాథన్ క్రిస్టీపై 17-21, 21-18, 21-19తేడాతో విజయం సాధించాడు.
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాయి ప్రణీత్, సైనా ఓటమి
గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయి ప్రణీత్ తాజాగా థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ విజేతగా నిలిచాడు. దీంతో 43 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
2013లో కిడాంబి శ్రీకాంత్ ఈ టైటిల్‌ను సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా 2011లో విజేతగా నిలిచింది. కాగా, మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనా నెహ్వాల్ ప్రపంచ 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బామ్‌రుంగ్‌పన్ (థాయ్‌లాండ్)తో జరిగిన సెమీఫైనల్లో సైనా 19-21, 18-21తో ఓడిపోయింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







