వ్యక్తిగత 'ఎన్‌ఓఎల్' కార్డుల జారీ
- October 10, 2015
దుబాయ్ రోడ్లు మరియు రవాణా శాఖ (ఆర్టిఏ) ఎన్‌ఓఎల్ ఎక్స్‌ప్రెస్ అనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. స్టాండర్డ్ మరియు గోల్డ్ క్లాస్ ప్యాసింజర్ల కోసం ఈ కార్డులను జారీ చేస్తోంది. ఎమిరేట్ ఐడితో ఈ కార్డుల్ని వినియోగించడం ఎంతో తేలిక. మెట్రో స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణీకులు తమ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ స్మార్ట్ కార్డ్ల్ని తీసుకొచ్చామనీ, భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడ్తామని ఆర్టిఏ అధికారులు వెల్లడించారు. జూమ్ మరియు మెట్రో ఔట్‌లెట్స్‌లో ఈ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్డ్ ప్రోసెస్‌లో భాగస్వామి అయిన ఇనాక్ సంస్థకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా కార్డులు, అందులోనూ వ్యక్తిగతంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం కార్డుల్ని జారీ చేయడం ఇదే ప్రధమమని భావిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









