సేమియా మంచూరియా
- June 04, 2017
కావలసిన పదార్థాలు : సేమియా-1 కప్పు, బంగాళదుంపలు-2, అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్-1 స్పూను, టమాటాలు-2, ఉల్లిపాయలు-2, గరం మసాలా-1 స్పూను, మొక్కజొన్న పిండి-3 స్పూన్లు, కారం- అర స్పూను, ఉప్పు-తగినంత, కొత్తిమీర-కొద్దిగా..
తయారుచేసే విధానం : ముందు సేమియాను మంచినీటిలో ఉడికించాలి. ఉడికిన తరువాత నీళ్లు వడగట్టి సేమియాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బంగాళదుంపలను ఉడికించి తొక్కు తీసేయాలి. ఒక గిన్నెలో ఉడికిన సేమియాను, బంగాళదుంపలను వేసి మెత్తగా పిసకాలి. అందులోనే తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మొక్కజొన్న పిండి ఒక స్పూన్ వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. మరో గిన్నెలో కొద్దిగా మొక్కజొన్న పిండి వేసి, అందులో నీరు పోసి పిండి చిక్కగా అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలి ఉంచి, అందులో కొంత నూనె పోసి, అది బాగా వేడెక్కాక.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండల్ని ఈ మొక్కజొన్న పిండిలో ముంచి బాణలిలో వేసి ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించాలి.
మరొక బాణలి స్టవ్ మీద ఉంచి, అందులో కొద్దిగా నూనె వేసి, పోపు గింజలు, ఆనక టమాట పేస్టు, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొంచెం సేపు వేపాలి. వేయించిన ఉండలను ఇందులో వేసి, తగినంత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. కర్రీ చిక్కబడిన తరువాత దింపేసి, మరో గిన్నెలోకి మార్చుకుని, పైన కొత్తిమీర ఆకులు చల్లితే చాలు.. సేమియా మంచూరియా రెడీ అయినట్లే! వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







